అమరావతి ఆమోదం ఏపీ చరిత్రలో సువర్ణాధ్యాయం
అమరావతిని రాజధానిగా పార్లమెంట్ ఆమోదించడంపై మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. రామచంద్రపురంలో మాట్లాడుతూ, ఏపీ చరిత్రలో ఇది సువర్ణాధ్యాయమని, అమరావతి అభివృద్ధితో రాష్ట్రానికి కొత్త దశ మొదలైందని వీడియో సందేశంలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాజధాని లేకుండా చేసిందని విమర్శించిన ఆయన, కేంద్రం నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా లభించిందని కొనియాడారు. ప్రజల తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి నిర్మాణంతో రాష్ట్రం మళ్లీ ప్రగతి పథంలో పయనిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
