మేఘావృతమైన ఆకాశంతో రామచంద్రపురం రైతుల్లో గుబులు

1093చూసినవారు
రామచంద్రపురం నియోజకవర్గంలో దాళ్వా వరి కోతలు, ధాన్యం ఆరబోత పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, బుధవారం ఆకాశం మేఘావృతమవడంతో రైతులు వర్షం కురుస్తుందేమోనని భయపడుతున్నారు. ధాన్యం ఆరబెట్టకపోతే తేమ శాతం తగ్గదని, ఒకవేళ ఆరబెడితే వర్షానికి తడిసి నాణ్యత దెబ్బతింటుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యానికి మద్దతు ధర దక్కదేమోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ఆకాశం వైపు చూస్తూ అష్టకష్టాలు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్