గురువారం కె. గంగవరం మండలం దంగేరు ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు రామచంద్రపురంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో గల ఆర్టోస్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా, విద్యార్థులు శీతల పానీయాల తయారీ, ప్యాకింగ్, రవాణా ప్రక్రియలను ఆసక్తిగా పరిశీలించారు. పారిశ్రామిక రంగంపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యమని హెచ్ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, తయారీలోని మెళకువలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.