ద్రాక్షారామ భీమేశ్వర స్వామి కళ్యాణోత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ లక్ష్మణ్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన వెల్లడించారు.