రామచంద్రపురం ఉపాధి భవన్‌లో ఈ నెల 4న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులు, వివిధ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ మేళాకు హాజరు కావచ్చని, పలు బహుళజాతి కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు పట్టణంలోని ఉపాధి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.