సోమవారం కె.గంగవరం మండలం దంగేరు గ్రామ శివారు చిట్టూరివారిపాలెంలో వైసీపీకి చెందిన 70 మంది కార్యకర్తలు మంత్రి సుభాశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. సీనియర్ నేత వాసంశెట్టి సత్యం వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు సమర్థత, మంత్రి సుభాశ్ పని తీరుకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు కార్యకర్తలు తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీని మరింత బలోపేతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.