రాష్ట్ర అభివృద్ధిని చూసి మాజీ సీఎం జగన్ ఓర్వలేక పోతున్నారని మంత్రి సుభాష్ గురువారం విమర్శించారు. రామచంద్రాపురంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా తాను ఒక పురుష కళాకారుడితో కలిసి డాన్స్ చేస్తే, దానిని అవహేళన చేస్తూ మాట్లాడటం జగన్ సంస్కారానికి తగదని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా వెనుకబడిన వర్గాల మంత్రులను, ఎమ్మెల్యేలను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. జగన్ వైఖరి ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి ఒక వీడియో సందేశంలో దుయ్యబట్టారు.