కోటిపల్లిలోని గోదావరి కాలువలో ఆదివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సుమారు 40 ఏళ్ల పురుషుడిగా గుర్తించారు. మృతదేహం వివరాలు సేకరించి, సమీప పోలీసు స్టేషన్లకు సమాచారం అందించినట్లు ఎస్సై సోమేంద్ర తెలిపారు. మృతుని పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.