అమలాపురం కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో గురువారం (రేపు) ఉదయం 10 గంటల నుంచి మినీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేళాలో తిరుపతికి చెందిన 'ఇండో ఎంఐఎం', బెంగళూరుకు చెందిన 'ఫాక్స్కాన్' కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. 19-25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, టెన్త్, ఇంటర్, డిగ్రీ, బి. టెక్, పీజీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.