శనివారం ద్రాక్షారామ మార్కెట్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని వైస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరిశీలించారు. ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ధైర్యం చెప్పిన తోట త్రిమూర్తులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని పూర్తిస్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు.