కోనసీమలోని రామచంద్రపురంలో భాష్యం స్కూల్‌లో ఐదవ తరగతి చదువుతున్న 11 ఏళ్ల సిర్రా రంజిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆత్మహత్య చేసుకున్న ఇంటిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు.