రామచంద్రాపురం: చున్నీతో ఉరి వేసుకుని చిన్నారి మృతి

2చూసినవారు
కోనసీమలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రామచంద్రాపురం పట్టణం త్యాగరాజనగర్ లో చిర్రా సునీత, రాజు దంపతులకు రెండో కుమార్తె రంజిత (ఐదవ తరగతి విద్యార్థిని) ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి గదికి గడియ పెట్టి ఉండడంతో అనుమానం వచ్చి చూడగా రంజిత ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్