రామచంద్రపురం: మామిడి పూతపై మంచు పంజా.. రైతుల ఆందోళన!

906చూసినవారు
రామచంద్రపురం మండలంలో కురుస్తున్న అధిక మంచు కారణంగా మామిడి పూత దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మంచు ప్రభావంతో పంటకు బూడిద తెగులు, తేనెమంచు పురుగు ఆశించే ప్రమాదం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు హెచ్చరించారు. దీని నివారణకు లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల వేపనూనె కలిపి పిచికారీ చేయాలని సూచించారు. గురువారం రైతులు మాట్లాడుతూ, కీలకమైన పూత దశలో తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే పంటను కాపాడుకోవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్