రామచంద్రపురం వైసీపీ ఇంచార్జ్ పిల్లి సూర్యప్రకాష్, అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూను అధికార పక్షం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని విమర్శించారు. శనివారం రామచంద్రపురంలో ఆయన మాట్లాడుతూ, లడ్డూ కల్తీపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రపంచవ్యాప్త భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన సూచించారు.