ద్రాక్షారామలోని ఒక బంగారు రుణాల సంస్థలో మాజీ మేనేజర్ ఎస్. మగేష్, కస్టమర్లు తాకట్టు పెట్టిన 151 గ్రాముల బంగారాన్ని దొంగిలించి, వాటి స్థానంలో రోల్డ్ గోల్డ్ పెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఆడిటింగ్‌లో 8 మంది కస్టమర్లకు చెందిన రూ. 19.63 లక్షల విలువైన ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత ఏరియా మేనేజర్ పి. భానుప్రకాష్ ఫిర్యాదు మేరకు ద్రాక్షారామ ఎస్సై ఎం. లక్ష్మణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.