ద్రాక్షారామలో వైభవంగా శ్రీ భీమేశ్వర స్వామి రథయాత్ర

403చూసినవారు
రామచంద్రపురం మండలం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ పురవీధుల గుండా సాగిన స్వామివారి రథం వేగాయమ్మపేట మండపానికి చేరుకుంది. ఈ వేడుకను తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ద్రాక్షారామ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. రాత్రి అక్కడే బస చేసిన స్వామి, అమ్మవార్లు ఆదివారం ఉదయానికి తిరిగి ఆలయానికి చేరుకుంటారని అర్చకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్