అగ్ని ప్రమాదానికి గురైన ద్రాక్షారామ మార్కెట్ పునర్నిర్మాణానికి సోమవారం ఉదయం శంకుస్థాపన జరగనుంది. కమిటీ సభ్యులు ఈ విషయాన్ని తెలిపారు. అధికారులు జేసీబీల సాయంతో వ్యర్థాలను తొలగిస్తూ మార్కెట్ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు. ఈ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి, బాధితులైన వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.