వేగాయమ్మపేట రామారావుపేటలో సమనాసి గోవిందరాజు ఇంట్లో చోరీ జరిగింది. ఈ నెల 11న అండ్రంగి గ్రామంలో జరిగిన జాతరకు వెళ్లినప్పుడు, గుర్తుతెలియని దొంగలు ఇంటి వెనుక కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలికి చొరబడి, బీరువాలో ఉన్న సుమారు 85 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. జాతర ముగించుకుని వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ద్రాక్షారామ ఎస్సై లక్ష్మణ్ దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం తెలిపారు.