
మలికిపురం: గోదావరిలో చిన్నారి మృతదేహం లభ్యం
ఇద్దరు పిల్లలతో కలిసి దిండి వద్ద గోదావరిలో ఒక వ్యక్తి దూకిన ఘటనలో బుధవారం శిరిగినీడి జాహ్నవి (9) మృతదేహం లభ్యమైంది. తండ్రి శిరిగినీడి దుర్గాప్రసాద్, కుమారుడు మోహిత్ మృతదేహాలు మంగళవారం లభ్యం కాగా కుమార్తె మృతదేహం కూడా లభ్యమయింది. ఆధార్ అప్డేట్ చేయిస్తానని చెప్పి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి వారిని నదిలో తోసేసి దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.


































