కోనసీమ జిల్లాలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో తొలిరోజే 92.35 శాతం మంది లబ్ధిదారులకు నగదు అందింది. డీఆర్డీఏ పీడీ రాంబాబు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 1,95,150 పింఛన్లకు గాను 1,80,215 మందికి రూ. 77.33 కోట్లు పంపిణీ చేశారు. సఖినేటిపల్లిలో అత్యధికంగా 94.05 శాతం, కాట్రేనికోనలో అత్యల్పంగా 89.25 శాతం పంపిణీ జరిగింది. మిగిలిన లబ్ధిదారులకు గురు, శుక్రవారాల్లో పింఛన్లు అందజేస్తామని, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.