అంతర్వేదిలో వైభవంగా రథోత్సవం

516చూసినవారు
సఖినేటిపల్లి మండపం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా, గురువారం భీష్మ ఏకాదశి నాడు రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారు అమ్మవార్లతో కలిసి దివ్య రథంపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తన సోదరి గుర్రాలక్కమ్మ (అశ్వరూఢాంబికా దేవి) కి స్వామివారు సారె సమర్పించారు. ఈ వేడుకను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్