పశువులను ఢీకొన్న బైక్.. యువకుడు మృతి

1291చూసినవారు
పశువులను ఢీకొన్న బైక్.. యువకుడు మృతి
సఖినేటిపల్లి మండలం అంతర్వేది పీఎన్ఎమ్ కాలనీ ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రావులపాలెం, కొత్తపేట ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా, అకస్మాత్తుగా అడ్డువచ్చిన పశువులను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్