ముందుగానే పింఛన్లు: లబ్ధిదారుల ముంగిటకే "ఎన్టీఆర్ భరోసా"

649చూసినవారు
ముందుగానే పింఛన్లు: లబ్ధిదారుల ముంగిటకే "ఎన్టీఆర్ భరోసా"
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అమలాపురం పట్టణంలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన "ఎన్టీఆర్ భరోసా" సామాజిక భద్రతా పింఛన్లను ఒక రోజు ముందుగానే ప్రజల ముంగిటకే చేరవేశారు. అమలాపురం పట్టణం 18వ వార్డు శ్రీరామ్ నగర్ పరిధిలో అవ్వాతాతలకు, వితంతువులకు మరియు దివ్యాంగులకు పింఛన్లను స్వయంగా పంపిణీ చేశారు. పేద ప్రజల కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యంగా, వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ముందస్తు పంపిణీ జరిగింది. ప్రభుత్వ సేవలను నేరుగా ఇంటి వద్దకే తీసుకురావడమే తమ బాధ్యత అని అధికారులు తెలిపారు. ముందస్తుగా పింఛన్ అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి గారికి మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్