మాలలంతా ఏకతాటిపై నిలబడాలి: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

624చూసినవారు
మాలలంతా ఏకతాటిపై నిలబడాలి: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం, పుల్లేటికుర్ గ్రామంలో మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పీ.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాలలంతా ఏకతాటిపై నిలబడి, పార్టీలు వేరైనా జాతి ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అవసరమైతే తనను నిర్భయంగా అడగవచ్చని, జాతికి ఆపద వస్తే ముందుండి పోరాడతానని భరోసా ఇచ్చారు. పరస్పర గౌరవంతో జాతిని బలోపేతం చేయాలని సూచిస్తూ, ఇలాంటి సమావేశాలను నియోజకవర్గ స్థాయిలో కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్