అంబేద్కర్ జయంతోత్సవ కరపత్రం ఆవిష్కరణ

248చూసినవారు
అంబేద్కర్ జయంతోత్సవ కరపత్రం ఆవిష్కరణ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలులో నియోజకవర్గ స్థాయి షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, ఏప్రిల్ 12న జరగబోయే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్, ఎస్సీ నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యురాలు, రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ పాముల రాజేశ్వరి దేవి, నియోజకవర్గ ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్షులు పొలమూరి శ్యాంబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్