అంతర్వేదిలో ఘనంగా 'అన్న పర్వత' మహానివేదన

410చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శుక్రవారం 'అన్న పర్వత' మహానివేదన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పాలమూరు వారి సత్రం నిర్వాహకుల సహకారంతో ఆలయ అర్చకులు ఈ వేడుకను నిర్వహించారు. లోకంలో క్షేమభిక్షలు కలగాలని, భక్తుల ఇళ్లలో ఆకలి బాధలు లేని అన్న సంపద నిరంతరం ఉండాలనే సంకల్పంతో ఈ ఏటా ఈ వేడుకను జరిపించడం ఆనవాయితీ. అంతకుముందు ఆలయ సన్నిధిని శుద్ధి చేసి, విశేష పూజల అనంతరం స్వామివారికి ఈ మహా నివేదన సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్