సఖినేటిపల్లి మండలం అంతర్వేది పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్వామివారు రాజాధిరాజ వాహనంపై అధిష్టించి గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ అత్యంత శోభాయమానంగా సాగిన ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు.