అంతర్వేది: మంచినీటి పథకాన్ని ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్

673చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జల జీవన్ మిషన్ కింద ₹17.33 కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ మంచినీటి పథకాన్ని ఈ నెల 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఈ వివరాలను వెల్లడిస్తూ, ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతిరోజూ 30 లక్షల లీటర్ల శుద్ధి చేసిన నీటిని అందిస్తామని తెలిపారు. దీనివల్ల అంతర్వేది, అంతర్వేది పల్లిపాలెం, గొంది, అంతర్వేదికర గ్రామాల ప్రజలకు మూడు దశాబ్దాల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. పవన్ కళ్యాణ్ చొరవతో నియోజకవర్గంలోని మంచినీటి మరియు రహదారుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్