ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు బుధవారం సాయంత్రం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ప్రమాదానికి గురైంది. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రవచనాలు చెప్పడానికి వస్తున్న సమయంలో తాళ్లరేవు వద్ద ఆయన కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, స్వామి వారి దయతో సురక్షితంగా బయటపడ్డామని చాగంటి తెలిపారు.