మామిడికుదురులో రైతులకు అవగాహన సదస్సు

1063చూసినవారు
ఆన్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ వంటి ఎరువులను కొనుగోలు చేయడం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలున్నాయని వ్యవసాయ శాఖ అధికారి (AO) ఎన్. వి. వి. సత్యనారాయణ తెలిపారు. మామిడికుదురు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రైతులకు దీనిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, మొబైల్ యాప్ ద్వారా సులభంగా ఇంటి వద్ద నుంచే ఎరువులను ఆర్డర్ చేసుకోవచ్చన్నారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వం ప్రకటించిన అధికారిక ధరలకే నాణ్యమైన ఎరువులు నేరుగా లభిస్తాయని, రైతులు ఈ డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్