మలికిపురంలో "వెన్నుపోటు" నిరసన ప్రదర్శన

452చూసినవారు
రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మలికిపురంలో శుక్రవారం కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి మాట్లాడుతూ, రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను దగా చేసిందని విమర్శించారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదని, తాగునీటి సమస్యలను వదిలేసి మద్యాన్ని మాత్రం విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారని ఆరోపించారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్