సఖినేటిపల్లి మండలం అంతర్వేది క్షేత్రంలోని లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన స్వామివారి వైశిష్ట్యాన్ని, ధర్మ మార్గాన్ని వివరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు చేశారు. ఈ ప్రవచనాలను వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు, ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో నిండిపోయింది.