పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రాజోలు మండలం చింతలపల్లి జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని కోళ్ల లక్ష్మిసాయి అమృత 591 మార్కులు సాధించి మండలంలో టాపర్‌గా నిలిచింది. ప్రయివేటు స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ కుమార్తె అయిన ఆమె ఈ ఘనత సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలలను వెనక్కి నెట్టి మండలంలో టాపర్‌గా నిలవడం పట్ల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.