అంతర్వేదిలో చిరంజీవి అన్నదాన సత్రం

334చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీర్థం సందర్భంగా జనసేన నాయకులు వులిశెట్టి లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిరంజీవి అన్నదాన సత్రాన్ని గురువారం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి సందర్శించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నప్రసాద వితరణ చేయడం సంతోషదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసైనికులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్