విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందని కలెక్టర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పై అవగాహన పెంచాలని అధికారులను స్పష్టంగా సూచించారు.