చించినాడ వారధిపై 'నడక' కష్టాలు

971చూసినవారు
వశిష్ట నదిపై దిండి-చించినాడ మధ్య వారధి మరమ్మతు పనులు ఎనిమిది నెలలుగా కొనసాగుతూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. 56 బేరింగుల మార్పు కోసం 2025 జూలై నుండి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో, రోజుకు 10 వేల మంది ప్రయాణికులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. సుమారు 3 వేల మంది ప్రయాణికులు ఒకటిన్నర కిలోమీటర్ల మేర కాలినడకన వారధి దాటాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు నత్తనడకన సాగుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి పనులను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్