వ్యసనాలకు బానిసై అప్పులపాలై, వాటిని తీర్చడానికి దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న రాజోలు మండలం రుద్రవారిమెరక గ్రామానికి చెందిన ఇంటిపల్లి రామారావు అలియాస్ శ్రీరామ్ అలియాస్ రాము (31) అనే ఇంజినీరింగ్ పట్టభద్రుడిని సుల్తాన్ బజార్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణలో కలిపి 81 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడు, ఏటీఎం కేంద్రాల్లో డబ్బు జమ చేసేవారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. ఇటీవల సికింద్రాబాద్‌కు చెందిన సునీత వద్ద రూ.లక్ష నగదు తీసుకొని మోసం చేయగా, పోలీసులు అతడిని పట్టుకున్నారు. అతడి ఖాతాలోని రూ.2.40 లక్షలను ఫ్రీజ్ చేశారు.