రైతులు పండించే ప్రతి పంటకూ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ అఖిలభారత రైతు సంఘం, రాజోలు సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని గ్రీవెన్స్ సెల్‌లో అందజేశారు. సీపీఐ నాయకుడు దేవ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు రూ.50,000 ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.