కోనసీమ, రాజోలులోని మలికిపురంలో ఈరోజు, స్కూలు పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ఎమ్మార్వో ఆఫీస్ వద్దకు రాగానే మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే పిల్లలందరినీ సురక్షితంగా బయటకు దించి, నీళ్లతో మంటలను ఆర్పాడు. ఈ సంఘటనలో పిల్లలందరూ సురక్షితంగా బయటపడ్డారు.