తూర్పుపాలెంలో గ్యాస్ లీకేజీ

952చూసినవారు
తూర్పుపాలెంలో గ్యాస్ లీకేజీ
మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఆదివారం గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. ఇటీవల రీ-డ్రిల్లింగ్ పూర్తయిన బావి పక్కనున్న పైప్‌లైన్ నుంచి దట్టమైన పొగలా గ్యాస్ బయటకు చిమ్ముతోంది. దీంతో పరిసర ప్రాంతమంతా గ్యాస్ వాసన వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే ఓఎన్‌జీసీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్