డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, పెదపట్నంలంక గ్రామంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ రూ.81 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.36 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, సీసీ రోడ్డు నిర్మాణం వంటివి ఉన్నాయి. ఈ పనులు గ్రామ ప్రజల మౌలిక వసతులను మెరుగుపరుస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.