రాజవరంలో లంక భూములకు గోదావరి కోత

1153చూసినవారు
ఆత్రేయపురం మండలం రాజవరంలో గోదావరి వరద ప్రవాహం కారణంగా విలువైన లంక భూములు తీవ్రంగా కోతకు గురవుతున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదీ కోత ఇలాగే కొనసాగితే భారీ నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్