మలికిపురం మండలం గూడపల్లికి చెందిన జబర్దస్త్ నటుడు బాబీ, తాను మరణించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బుధవారం ఖండించారు. రాజమండ్రిలో జరిగిన ప్రమాదంలో మరణించింది తన స్నేహితుడు, 'సుమా అడ్డా' నటుడు బాబీ అని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం తాను షూటింగ్‌లో ఉండగా, తన ఫోటోతో కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని, అభిమానులు, మిత్రులు ఆందోళన చెందవద్దని ఆయన ఒక ప్రకటనలో కోరారు.