రాజోలులో జలమయమైన ఇందిరా కాలనీ రోడ్లు

21చూసినవారు
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సోంపల్లి ఇందిరా కాలనీలో భారీ వర్షాల కారణంగా సిసి రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. బుధవారం కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ వాసులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నీటి పారుదలకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్