అంతర్వేదిలో 'జల' సిరి - మెగా మంచినీటి ప్రాజెక్టు ప్రారంభం

570చూసినవారు
ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం అమరావతి నుంచి వర్చువల్ విధానంలో అంతర్వేదిలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 30 వేల మంది దాహార్తిని తీర్చే భారీ మంచినీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన అంతర్వేదిని అన్ని రకాల మౌలిక సదుపాయాలతో మరింతగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్