కరవాక: జడ్పీ స్కూలుకు వరుసగా రెండో ఏడాది 100% ఫలితాలు

840చూసినవారు
సముద్ర తీర ప్రాంతంలోని కరవాక జడ్పీ హైస్కూల్ పదో తరగతి పరీక్షల్లో వరుసగా రెండో ఏడాది కూడా 100% ఉత్తీర్ణత సాధించి అద్భుత విజయాన్ని అందుకుంది. పరీక్షలకు హాజరైన 17 మంది విద్యార్థులూ ఉత్తీర్ణులవగా, వారిలో 15 మంది 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఈ ఘనతకు ఉపాధ్యాయుల సమిష్టి కృషి, అధికారుల మార్గదర్శకత్వమే కారణమని ప్రధానోపాధ్యాయులు హరనాథ్ గురువారం తెలిపారు. విద్యార్థుల ప్రతిభను అందరూ ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్