ఉపాధి కోసం ఖతార్ వెళ్లి యజమానుల వేధింపులతో నరకయాతన అనుభవించిన మామిడికుదురు మండలం కొమరాడకు చెందిన కనకదుర్గ, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రత్యేక చొరవతో మంగళవారం సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. గత నవంబర్‌లో ఏజెంట్ ద్వారా ఖతార్ వెళ్లిన ఆమెకు అక్కడ సరైన ఆహారం అందక, శారీరక, మానసిక వేధింపులకు గురై ఆరోగ్యం క్షీణించింది. బాధితురాలి భర్త నాగరాజు 'కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్' (KCM)ను ఆశ్రయించగా, కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఏజెంట్‌పై ఒత్తిడి తెచ్చి ఆమెను రప్పించారు. తమకు అండగా నిలిచిన జిల్లా యంత్రాంగానికి బాధితురాలి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.