మామిడికుదురు ప్రభుత్వ బాలుర వసతి గృహంలో కనీస సౌకర్యాలు కరువవ్వడంపై విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఆరోపించారు. 68 మంది విద్యార్థులున్న ఈ హాస్టల్‌లో కిటికీల మెష్‌లు, ఫ్యాన్లు, లైట్లు పాడైపోయాయని, నూతనంగా నిర్మిస్తున్న 24 బాత్రూమ్‌ల పనులు మధ్యలోనే నిలిచిపోయాయని, ప్రస్తుతం ఉన్న వాటికి నీటి సరఫరా కూడా జరగడం లేదని వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.