రాజోలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ బాబును లక్కవరం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. చాంబర్ అధ్యక్షులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఆధ్వర్యంలో నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సినిమాల విడుదల సమయంలో థియేటర్ల వద్ద బైక్‌ల రష్ డ్రైవింగ్, సైలెన్సర్ల మితిమీరిన శబ్దాలు, ప్రమాదకర భారీ ఫ్లెక్సీలు, డీజేల వల్ల వ్యాపారస్తులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఐ దృష్టికి తీసుకెళ్లి, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.