ఆయుష్మాన్ ఆరోగ్య మందిరానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన

866చూసినవారు
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం, పోతవరం గ్రామంలో సుమారు రూ.36 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనానికి పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆరోగ్య రంగం బలోపేతం అవుతోందని తెలిపారు. పి. గన్నవరం నియోజకవర్గానికి మంజూరైన 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు సుమారు రూ.14 కోట్ల నిధులతో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్